గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 09:59:30

దేశంలో 11 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 11 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. దీంతో పాజిటివ్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. ప్ర‌తిరోజు 34 వేల‌కు కేసులు న‌మోద‌వుతుండ‌టంతో నాలుగు రోజుల్లోనే 1.30 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 11 ల‌క్షల మార్కును దాటాయి. ‌తాజాగా గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో కొత్త‌గా 40,425 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 11,18,043కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 3,90,459 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,00,087 మంది బాధితులు కోలుకుని ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా క‌రోనా వైర‌స్‌తో కొత్త‌గా 681 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 27,497కు చేరింది.  

జూలై 19వర‌కు దేశంలో 1,40,47,908 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఆదివారం 2,56,039 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. 


logo