e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News నాలుగేండ్ల బాలిక‌ను ఇంట్లోంచి ఎత్తుకెళ్లి చంపిన చిరుత‌

నాలుగేండ్ల బాలిక‌ను ఇంట్లోంచి ఎత్తుకెళ్లి చంపిన చిరుత‌

నాలుగేండ్ల బాలిక‌ను ఇంట్లోంచి ఎత్తుకెళ్లి చంపిన చిరుత‌

శ్రీన‌గ‌ర్‌: ఓ నాలుగేండ్ల చిన్నారి ఆదా ష‌కీల్ గురువారం సాయంత్రం వ‌ర‌కు ఇంటి ప‌రిస‌రాల్లోనే ఆడుతూ క‌నిపించింది. కానీ ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయింది. దాంతో కంగారుప‌డ్డ బాలిక త‌ల్లిదండ్రులు రాత్రి వ‌ర‌కు వెతికినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. శుక్ర‌వారం ఉద‌యం మ‌ళ్లీ అంత‌టా గాలించ‌గా ఇంటికి స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో శ‌వ‌మై క‌నిపించింది. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రంలోని బుద్గామ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అట‌వీ అధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. బాలిక మృత‌దేహంపై ఉన్న గాయాల‌ను ప‌రిశీలించి చిరుత‌పులి దాడిలో ఆ చిన్నారి చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత అట‌వీ సిబ్బంది చిరుత‌పులి జాడ కోసం గాలింపు చేప‌ట్టారు. కాగా, త‌మ‌కు చిరుత‌పులుల బెడ‌ద లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్థానికులు అట‌వీ అధికారుల‌ను కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాలుగేండ్ల బాలిక‌ను ఇంట్లోంచి ఎత్తుకెళ్లి చంపిన చిరుత‌

ట్రెండింగ్‌

Advertisement