గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 14:13:10

వైద్య సిబ్బందికి స‌రిగా జీతాలు చెల్లించ‌ని నాలుగు రాష్ట్రాలు

వైద్య సిబ్బందికి స‌రిగా జీతాలు చెల్లించ‌ని నాలుగు రాష్ట్రాలు

న్యూఢిల్లీ: క‌రోనా పోరులో ముందున్న వైద్య సిబ్బందికి నాలుగు రాష్ట్రాలు స‌రిగా జీతాలు చెల్లించ‌లేదు. మ‌హారాష్ట్ర‌, పంజాబ్‌, క‌ర్నాట‌క‌, త్రిపుర రాష్ట్రాలు వైద్యులు, న‌ర్సుల‌కు స‌మ‌యానుకూలంగా వేత‌నాలు చెల్లించ‌లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు జారీ చేసిన సూచ‌న‌ల‌ను ఈ రాష్ట్రాలు ప‌ట్టించుకోలేద‌ని చెప్పింది. అయితే కేంద్ర‌మే ఈ అంశంలో జోక్యం చేసుకోవాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. విప‌త్తునివార‌ణ చ‌ట్టం కింద కేంద్రానికి ఉన్న అధికారాల‌ను వినియోగించుకోవాల‌ని న్యాయ‌మూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాతో కూడిన ధ‌ర్మాస‌నం చెప్పింది. ఈ మేర‌కు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. క‌రోనా పోరులో ముందున్న డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం నేరం కింద‌కు వ‌స్తుంద‌ని జూన్ నెల‌లో సుప్రీంకోర్టు తెలిపింది. కొంద‌రు డాక్ట‌ర్లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ఈ మేర‌కు స్ప‌ష్టం చేసింది. 



logo