మంగళవారం 07 జూలై 2020
National - Jun 20, 2020 , 01:08:55

ఏపీలో వైసీపీ క్లీన్‌స్వీప్‌ నాలుగు రాజ్యసభ సీట్లూ కైవసం

ఏపీలో వైసీపీ క్లీన్‌స్వీప్‌ నాలుగు రాజ్యసభ సీట్లూ కైవసం

  • దేశవ్యాప్తంగా 19 స్థానాలకు ఎన్నికలు
  • పెద్దల సభకు ఎన్నికైన దిగ్విజయ్‌, సింధియా

న్యూఢిల్లీ, జూన్‌ 19: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీచేసిన వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు. దేశవ్యాప్తంగా 8 రాష్ర్టాల పరిధిలోని 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. రాజకీయ సంక్షోభం నెలకొన్న మణిపూర్‌లో రాజ్యసభ పోరు ఉత్కంఠ రేకెత్తించింది. అధికార బీజేపీకి చెందిన సనజావోబా కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలుపొందారు. గుజరాత్‌లో బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ తరఫున కేసీ వేణుగోపాల్‌, నీరజ్‌ డాంగీ గెలుపొందగా, బీజేపీ తరఫున రాజేంద్ర గెహ్లాట్‌ విజయం సాధించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌ నుంచి గెలుపొందారు. జార్ఖండ్‌ నుంచి జేఎంఎం అధినేత శిబూ సొరేన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్‌ ప్రకాశ్‌ విజయం సాధించారు. 


logo