మంగళవారం 31 మార్చి 2020
National - Feb 21, 2020 , 12:42:35

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

ముంబయి : మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వైరాగ్‌ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు - జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయింది. నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


logo
>>>>>>