సోమవారం 18 జనవరి 2021
National - Jan 01, 2021 , 16:08:08

ఇండియాలో మ‌రో 4 కొత్త ర‌కం క‌రోనా కేసులు

ఇండియాలో మ‌రో 4 కొత్త ర‌కం క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: ఇండియాలో మ‌రో నలుగురికి కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ సోకినట్లు ప్ర‌భుత్వం శుక్ర‌వారం వెల్ల‌డించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది. గ‌త మూడు రోజుల్లో 25 మంది ఈ కొత్త వైర‌స్ బారిన ప‌డ‌గా.. తాజాగా మ‌రో నాలుగు కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 10 కేసులు దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక మిగ‌తా వాటిలో బెంగ‌ళూరులో 10, హైద‌రాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని క‌ళ్యాణిలో 1 కేసు న‌మోదైంది. ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు బ్రిట‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ కొత్త ర‌కం కేసులు.. ఇండియాతోపాటు డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, స్వీడ‌న్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, కెన‌డా, జ‌పాన్‌, లెబ‌నాన్‌, సింగ‌పూర్ దేశాల్లో వెలుగు చూశాయి.