బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 17:41:10

కర్ణాటకలో మళ్లీ కరోనా కలకలం

కర్ణాటకలో మళ్లీ కరోనా కలకలం

కర్ణాటకలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. శనివారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కర్ణాటక ప్రజలు.. ఒకేరోజు నాలుగు కొత్త కేసులు నమోదవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజా కేసులతో కలిపి కర్ణాటకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. 

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 306కు చేరింది. ఇందులో అత్యకంగా మహారాష్ట్రలో 63 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో సైతం కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది.


logo
>>>>>>