గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 15:05:49

క‌రోనాతో మ‌ర‌ణిస్తే.. 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

క‌రోనాతో మ‌ర‌ణిస్తే.. 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ సోకి మ‌ర‌ణించిన వారికి బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించ‌నున్న‌ది. ఆ డ‌బ్బును బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు అందివ్వ‌నున్న‌ట్లు సీఎం నితీశ్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ సొమ్మును ఇవ్వ‌నున్నారు.  క‌రోనా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. ఇండో నేపాల్ బోర్ద‌ర్‌లో మొత్తం 49 చోట్ల ప్ర‌యాణికుల‌కు స్క్రీనింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో..  బీహార్ అసెంబ్లీని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.  


logo