శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 28, 2020 , 13:07:35

బ‌స్సు కిందికి దూసుకెళ్లిన కారు.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

బ‌స్సు కిందికి దూసుకెళ్లిన కారు.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

నోయిడా: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ్రేట‌ర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గింది. ఓ ఇన్నోవా కారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన బ‌స్సు కింద‌కు దూసుకుపోయింది. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. శ‌నివారం ఉద‌యం గ్రేట‌ర్ నోయిడాలోని యుమున ఎక్స్‌ప్రెస్ వే పైన బెటా-2 పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. 

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. కారు నుంచి క్ష‌త‌గాత్రుడిని వెలికితీసి చికిత్స నిమిత్తం నోయిడా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతదేహాల‌ను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. ఐదుగురు ప్ర‌యాణికుల‌తో అతివేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపుత‌ప్పి బ‌స్సును వెనుక నుంచి ఢీకొట్టింద‌ని, కారు బ‌స్సు కింద‌కు దూసుకుపోవ‌డంతో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయార‌ని పోలీసులు తెలిపారు.      


logo