శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 11:43:24

గుజరాత్‌లో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా

గుజరాత్‌లో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా నేపథ్యంలో సోమవారం నుంచి ఐదురోజులపాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆదివారం శాసనసభ సిబ్బందితోపాటు శాసనసభ సభ్యులకు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే వైరస్‌ బారినపడినట్లు గుర్తించారు. ఇప్పటికే 56 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు 80 మంది బీజేపీ ఎమ్మెల్యేకు పరీక్ష నిర్వహించామని గాంధీనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకన్వార్‌ గధావిచరణ్‌ తెలిపారు. కోవిడ్‌ పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యేలనే సమావేశాలకు అనుమతి ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.