మంగళవారం 31 మార్చి 2020
National - Mar 15, 2020 , 16:14:55

నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా

నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్రత్రివేదికి సమర్పించారు. గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నాకు రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల పేర్లను సోమవారం ప్రకటిస్తామని స్పీకర్‌ రాజేంద్రత్రివేది తెలిపారు.

నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 73నుంచి 69కి చేరింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హార్స్‌ ట్రేడింగ్‌ కు పాల్పడేందుకు అవకాశమున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. 
logo
>>>>>>