బుధవారం 24 ఫిబ్రవరి 2021
National - Jan 20, 2021 , 22:11:47

ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ

ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: ఆ నలుగురి మరణానికి కరోనా టీకా కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా టీకా వేయించుకున్న వారిలో కర్ణాటకలో ఇద్దరు, ఉత్తర ప్రదేశ్‌లో ఒకరు, తెలంగాణలో ఒకరు చనిపోయినట్లుగా రిపోర్ట్‌ వచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ తెలిపారు. అయితే వారి మరణాలకు టీకాకు సంబంధం లేదని, కార్డియోపల్మోనరీ వ్యాధితో చనిపోయినట్లు పోస్ట్‌మార్టం ద్వారా నిర్ధారణ అయ్యిందన్నారు. తెలంగాణలో మరణించిన వ్యక్తి పోస్ట్‌మార్టం రిపోర్టు అందాల్సి ఉందన్నారు. బుధవారం నాటికి మొత్తం 7,86,842 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా ఏమీ రిపోర్టు కాలేదని వెల్లడించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo