బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 09:44:14

క‌స్ట‌డీ డెత్‌.. న‌లుగురు పోలీసుల్ని అరెస్టు చేసిన సీఐడీ

క‌స్ట‌డీ డెత్‌.. న‌లుగురు పోలీసుల్ని అరెస్టు చేసిన సీఐడీ

హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులోని ట్యూటికోరిన్‌లో పోలీసు క‌స్ట‌డీలో తండ్రీకొడుకులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌లో ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు యాక్ష‌న్ తీసుకున్నారు.  మొబైల్ షాపు ఓన‌ర్లు జ‌య‌రాజ్‌, బెనిక్స్ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన పోలీసులను అరెస్టు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు.  ట్యూటికోరిన్ ఎస్ఐ ర‌ఘు గ‌ణేశ్‌తో పాటు మ‌రో ముగ్గురు పోలీసుల్ని అరెస్టు చేశారు.  అరెస్టు అయిన వారిలో స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ బాల‌కృష్ణ‌, కానిస్టేబుల్ ముత్తురాజ్‌, మురుగ‌న్‌లు ఉన్నారు.  ఈ కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం న‌లుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.  క‌స్ట‌డీ డెత్ కేసులో పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకునే ఆధారాలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల మ‌ద్రాస్ హైకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  కేసును సీబీఐకి అప్ప‌గించే వ‌ర‌కు .. సీఐడీ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మొబైల్ షాపు ఓన‌ర్ జ‌య‌రాజ్‌, అత‌ని కుమారుడు బెనిక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రెండు రోజుల క‌స్ట‌డీలో ఉన్న వాళ్లు.. అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు.  దీంతో ఈ కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.  ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతున్నామ‌ని సీబీ-సీఐడీ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శంక‌ర్ తెలిపారు.  జూన్ 19వ తేదీన జ‌రిగిన సంఘ‌ట‌న‌కు సంబంధించి సీసీటీవీ ఫూటేజ్‌ను కూడా ఇవ్వాల‌ని ఈ కేసులో కోర్టు ఆదేశించింది. క‌స్ట‌డీ డెత్ కేసులో పోలీసుల్ని అరెస్టు చేయ‌డంతో.. ట్యూటికోరిన్ స్థానికులు సంబ‌రాలు చేసుకున్నారు.  


logo