సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 07:31:00

రైళ్లు నడపడాన్ని వ్యతిరేకించిన నలుగురు సీఎంలు

రైళ్లు నడపడాన్ని వ్యతిరేకించిన నలుగురు సీఎంలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా నిలిపివేసిన రైళ్లను ఇప్పట్లో ప్రారంభించవద్దని నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ పరిస్థితులు, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నుంచి రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్యాసింజర్‌ రైళ్లను నడపడాన్ని తమిళనాడు, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. 

చెన్నైలో ప్రతిరోజు కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని, ఇప్పుడు రైల్వే సర్వీసుల ప్రారంభిస్తే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, వైరస్‌ ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతుందని, మే 31 వరకు రైళ్లను నడపకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని మోదీకి సూచించారు.


logo