మంగళవారం 31 మార్చి 2020
National - Feb 28, 2020 , 13:04:53

భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

లక్నో : భార్య తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుందని.. ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు భర్త. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని అర్తాలా ఏరియాలో శుక్రవారం చోటు చేసుకుంది. 25 ఏళ్ల వయసున్న ఐదేళ్ల క్రితం వివాహమైంది. అతని భార్య వయసు 23 సంవత్సరాలు. వీరికి నాలుగు, రెండేండ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అయితే శుక్రవారం ఉదయం భార్య, ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపేశాడు భర్త. అనంతరం అతను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఘటనాస్థలిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. తన భార్య నిరంతరం వేరే వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడుతున్నందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భర్త పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo
>>>>>>