గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 20:24:14

తమిళనాడులో కొత్తగా 4,985 కరోనా కేసులు

తమిళనాడులో కొత్తగా 4,985 కరోనా కేసులు

చెన్నై : తమిళనాడు క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24గంటల్లో 4,985 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం మరో 70 మంది వైరస్‌ ప్రభావంతో చనిపోగా మృతుల సంఖ్య 2,551కి చేరుకుంది. తమిళనాడులో గత 24 గంటల్లో 4,985 మంది కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయగా, 3,861 మంది బాధితులు వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు.

చెన్నైలో మహానగరంలో 1,298 కేసులు నిర్ధారణ అవగా, మొత్తం 87,235 చేరుకున్నాయి. 15,127 యాక్టివ్‌ కేసులుండగా, 70,651 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 1.75లక్షల (1,75,678) మార్క్‌ను దాటింది. మొత్తం 1,21,766 మంది కోలుకోగా, 51,348 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, 0-12 సంవత్సరాల వయసున్న 8,776 మంది పిల్లలు వైరస్‌ బారినపడ్డారు. సోమవారం ఒకే రోజు 52,087 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,84,579 నమూనాలను టెస్ట్‌ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా 112 కొవిడ్‌-19 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo