బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 06:33:43

కార్గిల్‌లో భూకంపం.. 4.7 తీవ్రత

కార్గిల్‌లో భూకంపం.. 4.7 తీవ్రత

లడఖ్‌: భారత్‌, చైనా సరిహద్దుల్లోని కార్గిల్‌లో భూకంపం సంభవించింది. కేంద్రపాలితప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.7గా నమోదయ్యింది. కార్గిల్‌కు వాయువ్యంగా 433 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది.   

జూలై 2న లడఖ్‌లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత 4.5గా నమోదయ్యింది. భూకంప కేంద్రం కార్గిల్‌కు వాయువ్యంగా 119 కి.మీ. దూరంలో ఉన్నది. అదేరోజు లడఖ్‌లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. జూలై 3న ఢిల్లీలో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి.


logo