బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:45:30

తమిళనాడులో కొత్తగా 4,549 కరోనా కేసులు

తమిళనాడులో కొత్తగా 4,549 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడు రాష్ర్టంలో కరోనా విలయం కొనసాగుతుంది. రాష్ర్టంలో రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా 4,549 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 69 మంది తాజాగా కరోనాతో మృత్యువాత పడినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,56,369కి చేరింది. అందులో 46,714 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 1,07,416 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అయితే ఇప్పటివరకు రాష్ర్టంలో మొత్తం 2,236 మంది కరోనాతో మృతి చెందారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo