శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 21:33:32

కర్ణాటకలో కొత్తగా 4,120 కరోనా కేసులు

కర్ణాటకలో కొత్తగా 4,120 కరోనా కేసులు

బెంగళూరు :  కర్ణాటకలో కరోనా విజృంభిస్తున్నది. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒకే రోజు 4,120 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో దాదాపు సగానికిపైగా కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 63,772 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పింది. ఇందులో 39,370 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 23,065 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 91 మంది వైరస్‌తో మరణించారు. గడిచిన 24గంటల్లో 4,120 కేసులు నమోదైతే రాజధాని బెంగళూరులోనే 2,156 నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆదివారం నాటికి రాష్ట్రం 10లక్షల టెస్టుల మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 88 ల్యాబుల్లో 10,20,830 పరీక్షలు చేయగా, ఆదివారం ఒకే రోజు 35,834 పరీక్షలు చేసినట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి ఆదివారం ట్వీట్‌ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo