నారాయణపేట టౌన్, మే 21 : కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలను శుక్రవారం కొవిడ్ నిబంధనలు పాటించి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి డోలారోహణం, అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోనే శివలింగానికి భక్తులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, మే 21 : దామరగిద్ద మండల కేంద్రంలో కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఆలయంలో మండల ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటించి పూజలు నిర్వహించినట్లు ఆర్యవైశ్య సంఘం మహిళలు తెలిపారు.