న్యూఢిల్లీ: ఇప్పటివరకు టాప్ గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా టెస్లా నిలిచింది. ఆ సంస్థ మోడల్ త్రీ సెడాన్.. అంటే కార్ల కొనుగోలు దారులకు ఎంతో ఇష్టం.. గతేడాది డిసెంబర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైన టాప్ ఎలక్ట్రిక్ కార్లలో మొదటి స్థానంలో నిలిచింది టెస్లా మోడల్ త్రీ సెడాన్.. కానీ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో సీన్ మారిపోయింది. టెస్లా మోడల్ త్రీ సెడాన్ కారు రికార్డును చైనా-అమెరికా సంస్థల సంయుక్త కార్ల తయారీ సంస్థ ఉల్లింగ్.. హాంగ్ గాంగ్ మినీ ఈవీ బ్రేక్ చేసింది.
గత 2 నెలల సేల్స్‌లో హాంగ్గాంగ్ టాప్
గత జనవరిలో వుల్లింగ్ హాంగ్గాంగ్ మినీ ఈవీ కార్లు 36 వేలకు పైగా అమ్ముడయ్యాయి. కానీ టెస్లా మోడల్ త్రీ కార్లు సుమారు 21,500 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఇక గత ఫిబ్రవరిలో 13,700 యూనిట్ల విక్రయానికి టెస్లా త్రీ మోడల్ పరిమితం కాగా, వుల్లింగ్ హాంగ్గాంగ్ 20 వేలకు పైగా విక్రయించింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థ ఎస్ఏఐసీ మోటర్, వుల్లింగ్ మోటార్స్‌తోపాటు అమెరికా కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థే ఉల్లింగ్.
హాంగ్గాంగ్ ధర 4500 డాలర్లే
ఇక హాంగ్గాంగ్ మినీ ఈవీ ధర చైనాలో కేవలం 28,800 యువాన్లు (సుమారు 4,500 డాలర్లు). ఒకసారి చార్జింగ్ చేసుకుంటే 170 కి.మీ. దూరం ప్రయాణించొచ్చు. 100 కి. మీ. వేగంతో ప్రయాణించొచ్చు. 76.4 అంగుళాల వీల్ బేస్, 115 అంగుళాల పొడవు, 59 అంగుళాల వెడల్పు ఉంటుంది. మొత్తం కారు బరువు 1466 పౌండ్లు మాత్రమే. మరోవైపు, టెస్లా మోడల్ త్రీ కారు ధర 40 వేల డాలర్లు పలుకుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 250 మైళ్ల దూరం ప్రయాణించొచ్చు. దీని బరువు 3500 పౌండ్లు ఉంటుంది. వీల్ బేస్ 113 అంగుళాలు, పొడవు 185 అంగుళాలు, 73 అంగుళాల వెడల్పు ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !