మంగళవారం 07 జూలై 2020
National - Jun 21, 2020 , 18:40:19

ముంబైలో 24గంటల్లో 3874 కరోనా కేసులు

ముంబైలో 24గంటల్లో 3874 కరోనా కేసులు

ముంబై : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ముంబై నగరం వణికిపోతుంది. ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 3874 పాజిటీవ్‌ కేసులు నమోదైయ్యాయి. మహరాష్ట్రలో ఇప్పటి వరకు 7,54,000 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,28,205 మందికి పాజిటీవ్‌ వచ్చింది. మరో 160 మంది కరోనా బారిన పడి మృతి చెందడంతో కోవిడ్‌ మరణాల సంఖ్య 5,984కు చేరింది. తగ రెండు రోజుల్లో నమోదైన కేసుల్లో కేవలం ముంబైలోనే 1190 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇటీవల మరణించిన 160మందిలో 136  ముంబై నగరంలోనే నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటి వరకూ 65,329 పాజిటీవ్‌ కేసులు రాగా, 3561 మంది మృతి చెందారు. మహరష్ర్టలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా రికవరీ రేటు స్థిరంగా ఉంది. శనివారం ఒక్క రోజే 1380మంది డిచ్చార్జి అవగా.. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 64,153కు చేరింది. 


logo