బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 17:04:53

గుజ‌రాత్‌లో 387 మందికి హోమ్ ఐసోలేష‌న్ నుంచి విముక్తి

గుజ‌రాత్‌లో 387 మందికి హోమ్ ఐసోలేష‌న్ నుంచి విముక్తి

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో 387 మందికి హోమ్ ఐసోలేష‌న్ నుంచి విముక్తి ల‌భించ‌నుంది. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) రివైజ్డ్ డిశ్చార్జి పాల‌సీ ప్ర‌కారం వారిని హోమ్ ఐసోలేష‌న్ నుంచి విడుద‌ల చేస్తున్న‌ట్లు అహ్మ‌దాబాద్ స‌మాచార విభాగం అధికారులు తెలిపారు. విడుద‌ల కానున్న 387 మందిలో 250 మంది అహ్మ‌దాబాద్  న‌గ‌రానికి చెందిన వారు కాగా, 35 మంది సూర‌త్‌కు చెందిన వారు, 34 మంది వడ‌న‌గ‌ర్‌కు చెందిన వారు ఉన్నారు. 

వీరితోపాటు వ‌డోద‌రకు చెందిన 20 మంది, ఆనంద్‌కు చెందిన 17 మంది, రాజ్‌కోట్‌కు చెందిన 15 మంది, భావ్‌న‌గ‌ర్‌కు చెందిన 10 మంది, మ‌హిసాగ‌ర్‌కు చెందిన ఐదుగురు, అర‌వ‌ల్లికి చెందిన ఒక‌రు ఉన్నారు. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి క్లినిక‌ల్ టెస్టుల్లో నెగెటివ్ వ‌స్తే ఐసోలేష‌న్ గ‌డువు ముగిసిన‌ట్లేన‌ని ఆరోగ్యశాఖ స్ప‌ష్టంచేసింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా నెగిటివ్ వ‌చ్చిన 387 మంది హోమ్ ఐసోలేష‌న్ నుంచి విడుద‌ల కాబోతున్నారు.   


logo