గురువారం 16 జూలై 2020
National - Jun 25, 2020 , 17:56:11

మహారాష్ట్రలో 38 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో 38 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

ముంబై : కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీస్‌శాఖలో కల్లోలం సృష్టిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 38 మంది పోలీస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు మహారాష్ట్ర పోలీస్‌ అధికారులు తెలిపారు. మరో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొన్నారు. వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో పోలీసు సిబ్బందిలో మృతుల సంఖ్య 54కు పెరిగింది. ఇప్పటి వరకు 3,282 మంది రికవరీ కాగా, 991 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 4,326 మంది వైరస్‌ బారినపడ్డారని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,42,900 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. 


logo