మంగళవారం 26 మే 2020
National - May 11, 2020 , 12:05:56

ఆంధ్రప్రదేశ్‌లో మరో 38 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 38 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కి పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 975 యాక్టివ్‌గా ఉండగా, వైరస్‌ బారిన పడినవారిలో 998 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు 45 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 9, కర్నూలులో 9, అనంతపురంలో 8, గుంటూరులో 5, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో మూడు చొప్పున, నెల్లూరులో 1 కేసు ఉన్నాయి.  

మొత్తంగా అనంతపురంలో 115, చిత్తూరులో 121, కర్నూలులో 575, గుంటూరులో 387, కృష్ణా జిల్లాలో 342, నెల్లూరు 102, కడపలో 97,  పశ్చిమగోదావరిలో 68, విశాఖపట్నంలో 66, ప్రకాశం 63, తూర్పుగోదావరిలో 46 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo