గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:47:40

రాజస్తాన్‌లో కొత్తగా 375 కరోనా కేసులు

రాజస్తాన్‌లో కొత్తగా 375 కరోనా కేసులు

జైపూర్‌ : దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది.  రాజస్తాన్‌ రాష్ర్టంలో కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 375 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,595కు చేరిందని శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 9,125 మంది కరోనాతో దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 23,872 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 598 మంది మరణించినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 49,310 కరోనా కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,87,945కు చేరగా అందులో 440,135 మంది చికిత్స పొందుతుండగా.. 817,209 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo