ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 21:07:08

మ‌హారాష్ర్ట‌లో ఒక్క రోజే 62 మ‌ర‌ణాలు

మ‌హారాష్ర్ట‌లో ఒక్క రోజే 62 మ‌ర‌ణాలు

ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. సోమ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 3,721 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 62 మంది మృతి చెందారు. 1962 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  మ‌హారాష్ర్ట వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,35,796  పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణాల సంఖ్య 6,283కు చేరిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. 

ముంబైలో అత్య‌ధికంగా 67,586(మృతులు 3737), థానేలో 25,390(మృతులు 732). పుణెలో 16,474(మృతులు 612), పాల్గ‌ర్ లో 3,621(మృతులు 93), ఔరంగాబాద్ లో 3,564(మృతులు 178) పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.


logo