బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 19:43:34

మరో 37 మంది ఐటీబీపీ సిబ్బందికి కరోనా

మరో 37 మంది ఐటీబీపీ సిబ్బందికి కరోనా

న్యూఢిల్లీ: ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) సిబ్బందిలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే 53 మంది ఐటీబీపీ సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడగా తాజాగా మరో 37 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఐటీబీపీలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 90కి చేరింది. తాజాగా కరోనా పాజిటివ్‌ వచ్చిన 37 మంది ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారని ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు.


logo