శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 18:22:25

భారత్ లో 24 గంటల్లో 37 మంది మృతి

భారత్ లో 24 గంటల్లో 37 మంది మృతి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించింది. భారత్‌ నలుమూలల విస్తరించిన ఈ కరోనా ధాటికి గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 896 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6761కి చేరినట్లు పేర్కొంది. మొత్తం మరణాల సంఖ్య 206 కాగా, ఈ వైరస్‌ నుంచి 516 మంది కోలుకున్నారు. గడిచిన 48 గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యను చూస్తే 1487గా ఉంది. 


logo