గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 21:12:31

24 గంట‌ల్లో 362 పాజిటివ్ కేసులు

24 గంట‌ల్లో 362 పాజిటివ్ కేసులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా 362 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8904కు చేరుకుంది.  ఇప్ప‌టివ‌ర‌కు 3246 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార‌య్యారు.

ప్రాణాంత‌‌క క‌రోనా బారిన ప‌డి  537 మంది మృతి చెందారని గుజ‌రాత్ వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్ల‌లో కొన్ని షాపులకు  ప‌రిమితుల‌తో కూడిన అనుమ‌తి ఇస్తున్నారు. లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రోడ్ల‌పైకి వ‌స్తున్న‌వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo