బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 15:18:19

మర్కజ్‌లో పాల్గొన్న 391 మందికి క్వారంటైన్‌: యెడియూరప్ప

మర్కజ్‌లో పాల్గొన్న 391 మందికి క్వారంటైన్‌: యెడియూరప్ప

హైదరాబాద్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ను సందర్శించిన 391 మందిని గుర్తించామని, వారిని క్వారంటైన్‌కు తరలించాని కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప తెలిపారు. బీదర్‌లో 91 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని పేర్కొన్నారు. మార్చి నెలలో మర్కజ్‌ తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు 9000 మంది పాల్గొన్నారు. వీరిలో ఇప్పటికే వారిలో 6000 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా 300 మందికిపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 3000 మందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 


logo