సోమవారం 06 జూలై 2020
National - Jun 29, 2020 , 17:27:44

తీరానికి కొట్టుకువచ్చిన భారీ తిమింగళం

తీరానికి కొట్టుకువచ్చిన భారీ తిమింగళం

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి 36 అడుగుల పొడవైన భారీ తిమింగళం సోమవారం కొట్టుకువచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక మందర్‌మణి పోలీస్‌స్టేషన్‌తో సిబ్బందితో పాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దాన్ని పరిశీలించారు. తిమింగళం మృతి చెందిందని, ఇందుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వివరించారు.  తిమింగళం తోకతో పాటు శరీరంపై గాయాల గుర్తులున్నాయని పేర్కొన్నారు. మే 23న ఒడిశా కేంద్రపారా జిల్లాలోని గహిర్మఠ సముద్ర అభయారణ్యం ప్రాంతానికి కూడా 40 అడుగుల పొడవైన తిమింగలం కొట్టుకువచ్చింది. దాని శరీరంపై కూడా గాయాల గుర్తులున్నాయి. కాగా, వైల్డ్ లైఫ్ చట్టం, 1972 ప్రకారం అంతరించిపోతున్న జాతుల్లో తిమింగలాలు ఉన్నాయి.


logo