గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 12, 2020 , 20:09:56

సరిహద్దు నుంచి దేశంలోకి పక్షుల అక్రమ రవాణా.. బీఎస్ఎఫ్ స్వాధీనం

సరిహద్దు నుంచి దేశంలోకి పక్షుల అక్రమ రవాణా.. బీఎస్ఎఫ్ స్వాధీనం

కోల్‌కతా: సరిహద్దు నుంచి దేశంలోకి చిలుకలు వంటి పక్షులను అక్రమ రవాణా చేస్తుండగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ బారాన్‌బెరియాలోని బోర్డర్ అవుట్‌పోస్ట్ నుంచి అక్రమ రవాణా చేస్తున్న 36 పక్షులను మంగళవారం రాత్రి  సరిహద్దు భద్రతా దళం జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల నుంచి రక్షించిన ఆ పక్షులను బుధవారం రణఘాట్ అటవీ కార్యాలయానికి అప్పగించారు.
logo