శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 19:43:44

క‌శ్మీర్‌లో పెరుగుతున్న‌ క‌రోనా కేసులు

క‌శ్మీర్‌లో పెరుగుతున్న‌ క‌రోనా కేసులు

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. రోజూ రెండు వంద‌ల‌కు పైగానే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 353 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కొత్త కేసుల‌లో జ‌మ్ము డివిజ‌న్‌లో 129, క‌శ్మీర్ డివిజ‌న్‌లో 224 కేసులు ఉన్నాయి. కాగా, శుక్ర‌వారం న‌మోదైన కేసుల‌తో క‌లిపి ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 16,782కు చేరింది. 

మొత్తం కేసుల‌లో 9,217 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 7,269 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్ర‌వారం కొత్త‌గా ఒక్క మ‌ర‌ణం కూడా చోటుచేసుకోన‌ప్ప‌టికీ జ‌మ్ముక‌శ్మీర్లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 296గా ఉన్న‌ది. అందులో జ‌మ్ము డివిజ‌న్‌లో కేవలం 21 మ‌ర‌ణాలు న‌మోదుకాగా, మిగ‌తా 275 క‌రోనా మ‌ర‌ణాలు క‌శ్మీర్ డివిజ‌న్‌లోనే చోటుచేసుకున్నాయి.           

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo