పాట్నా: బీహార్‌లో ఓ నర్సు ఖాళీ సిరంజీతో ఓ వ్యక్తికి టీకా ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ నర్సును తొలగించారు. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ప్లాస్టిక్ కవర్ నుంచి కొత్త సిరంజీ తీసిన నర్సు.. నేరుగా ఓ వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చింది. అయితే ఆ ప్రక్రియ అంతా మొబైల్ ఫోన్లో షూట్ చేయడంతో ఆమె దొరికిపోయింది. ఫ్రెండ్ తీసిన వీడియో గురించి తెలుసుకున్న తర్వాతే తాను ఖాళీ సిరంజీ టీకా తీసుకున్నట్లు గుర్తించాని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే ఖాళీ టీకా తీసుకుకోవడం వల్ల తనకు తల నొప్పు వచ్చినట్లు అతను చెప్పాడు. మరో టీకా తీసుకోలేదన్నాడు. నిజానికి టీకా తీసుకుంటే ఫ్రెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మరో వ్యక్తి వీడియా తీశాడు. కానీ ఆ వీడియోను మళ్లీ చూసినప్పుడు తనకు డౌట్ వచ్చిందని, ప్లాస్టిక్ కవర్ నుంచి నేరుగా ఆ నర్సు సిరంజీ తీసి తన ఫ్రెండ్‌కు ఇచ్చినట్లు వీడియో తీసిన వ్యక్తి చెప్పాడు.