బుధవారం 02 డిసెంబర్ 2020
National - Apr 14, 2020 , 21:16:09

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్ కేసులు

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్ కేసులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది. రోజురోజుకూ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2684 కు చేరుకుంద‌ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా సంబంధిత మ‌ర‌ణాలు 178 న‌మోదు కాగా...259 మంది కోలుకున్నార‌ని వైద్యారోగ్య శాఖ తెలిపింది. క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో  ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించామ‌ని సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..