బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 10:28:29

పాన్ కోసం క‌రోనా రోగి ప‌రారీ

పాన్ కోసం క‌రోనా రోగి ప‌రారీ

ల‌క్నో : త‌న‌కిష్ట‌మైన పాన్ కోసం ఓ క‌రోనా రోగి ఆస్ప‌త్రి నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో శ‌నివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో అత‌న్ని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్ప‌త్రిలో చేర్చారు. అయితే అత‌నికి పాన్ అంటే ఇష్టం. అది లేక‌పోవ‌డంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం త‌న డ్ర‌స్సును ధ‌రించి ఆస్ప‌త్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. 

లాక్ డౌన్ కార‌ణంగా ఆస్ప‌త్రి ప‌రిస‌రాల్లో ఎలాంటి షాపులు తెర‌వలేదు. దీంతో ఆ క‌రోనా రోగి గాంధీ న‌గ‌ర్ వెళ్లాడు. అక్క‌డ ఓ షాపులో పాన్ తీసుకుని తిన్నాడు. అనంత‌రం అక్క‌డున్న త‌న బంధువుల ఇంటికెళ్లి.. త‌న‌ను ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేర్పించండి అని కోరాడు. చేసేదేమీ లేక వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. మొత్తానికి పోలీసులు, వైద్యులు అత‌న్ని తిరిగి ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు.


logo