మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 17:57:39

35 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ : సీఐఎస్ఎఫ్

35 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ : సీఐఎస్ఎఫ్

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా విధుల్లో ఉన్న భ‌‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌రోనా బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన 35 మంది జ‌వాన్లు క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో 11 మంది ముంబై ఎయిర్ పోర్టులో విధులు నిర్వ‌ర్తిస్తుండ‌గా..11 మంది ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేష‌న్ లో ప‌నిచేస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ముగ్గురు, ముంబై పోర్టులో డ్యూటీ చేస్తున్న‌ట్లు సీఐఎస్ఎఫ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కోల్ క‌తాలో సీఐఎస్ఎఫ్ కు చెందిన అసిత్ కుమార్ షా క‌రోనాతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo