మంగళవారం 26 మే 2020
National - May 14, 2020 , 17:48:55

ఒకేరోజు 34 కేసులు.. 446 మంది అరెస్ట్‌

ఒకేరోజు 34 కేసులు.. 446 మంది అరెస్ట్‌

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ పోలీసులు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. దీంతో అక్క‌డ ప్ర‌తిరోజు వంద‌ల సంఖ్య‌లో కేసులు అరెస్టులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం కూడా లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి 34 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 446 మంది అరెస్ట‌య్యారు. కాగా, లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి మొత్తం 2,961 కేసులు న‌మోద‌య్యాయి. 17,819 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్త‌రాఖండ్ పోలీస్ ప్ర‌ధాన కార్యాల‌య అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇక మోటారు వాహ‌న చ‌ట్టం కింద కూడా 39,528 వాహ‌నాల‌పై జ‌రిమానా విధించామ‌ని, 6,601 వాహ‌నాల‌ను సీజ్ చేశామ‌ని చెప్పారు. జ‌రిమానాల రూపాంలో మొత్తం రూ.2.09 కోట్లు వ‌సూలైన‌ట్లు పోలీసులు తెలిపారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo