శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 13:31:49

కోల్‌క‌తాలో 338 కంటైన్మెంట్ జోన్లు

కోల్‌క‌తాలో 338 కంటైన్మెంట్ జోన్లు

కోల్‌క‌తా:  కోల్‌క‌తా న‌గ‌రంలో మొత్తం 338 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన‌ట్లు కోల్‌క‌తా పోలీసులు, మున్సిప‌ల్ కార్పోరేష‌న్ సంయుక్తంగా జాబితా విడుద‌ల చేశారు. పశ్చిమ బెంగాల్‌లో క‌లోక‌తా, హౌరా, నార్త్ 24 ప‌ర‌గ‌ణాలు, పూర్బా మెదినిపూర్ జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఆరెంజ్ జోన్‌లో 11 జిల్లాలు, గ్రీన్ జోన్‌లో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో క‌లోక‌తాలో కాకుండా హౌరాలో 76 ప్రాంతాలు, ఉత్త‌ర ప‌ర‌గ‌ణాల‌లో 92, హుగ్లీలో 23, పూర్బా మేదిపూర్‌లో మూడు కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశారు. వెస్ట్‌బెంగాల్‌లో కోవిడ్‌-19తో మ‌ర‌ణించిన వారి సంఖ్య 113కు చేరుకుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 14 మందికి వైర‌స్ సోకింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1939 కోవిడ్‌-19 కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 1337 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 


logo