సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 09:41:45

కరోనాతో 24 గంటల్లో 95 మంది మృతి

కరోనాతో  24 గంటల్లో 95 మంది మృతి

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 95 మరణించగా, కొత్తగా 3,320 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59,662కు చేరింది. ఈ వైరస్‌ నుంచి 17,847 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1981. మహారాష్ట్రలో అత్యధికంగా 19,063, గుజరాత్‌లో 7,403, ఢిల్లీలో 6,318 కేసులు నమోదు అయ్యాయి. 

తమిళనాడులో 6,009, రాజస్థాన్‌లో 3,579, మధ్యప్రదేశ్‌లో 3,341, ఉత్తరప్రదేశ్‌లో 3,214, ఏపీలో 1,887, పంజాబ్‌లో 1,731, పశ్చిమ బెంగాల్‌లో 1,678, తెలంగాణలో 1,132, జమ్మూకశ్మీర్‌లో 823, కర్ణాటకలో 753, హర్యానాలో 647, బీహార్‌లో 579, కేరళలో 504, ఒడిశాలో 287, జార్ఖండ్‌లో 155, చండీగర్‌లో 146, త్రిపురలో 118, ఉత్తరాఖండ్‌లో 63, అసోంలో 60, ఛత్తీస్‌గఢ్‌లో 59, హిమాచల్‌ప్రదేశ్‌లో 50, లడఖ్‌లో 42, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 33, పుదుచ్చేరిలో 15, మేఘాలయాలో 12, గోవాలో 7, మణిపూర్‌లో 2, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.


logo