శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 12:14:16

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 2051కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్‌ ప్రభావంతో 46 మంది మరణించారు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన 949 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1056 మంది బాధితులు కోలుకున్నారు. 

కొత్తగా చిత్తూరులో 10, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొమ్మిది చొప్పున నమోదవగా, కృష్ణాలో 4, తూర్పుగోదావరిలో 1 కేసు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 33 కేసుల్లో 20 తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. మొత్తంగా 3129 మందికి కోయంబేడు మార్కెట్‌తో లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10,730 నమూనాలు సేకరించగా 33 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని అధికారులు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 58 మంది బాధితులు కోలుకున్నారు.


logo