బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 18:30:01

ధార‌విలో మ‌రో 33 మందికి క‌రోనా

ధార‌విలో మ‌రో 33 మందికి క‌రోనా

ముంబై: ధార‌విలో మ‌రో 33 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధార‌విలో క‌రోనా మ‌హ‌మ్మారి గత నెల మొద‌టి వారంలో 10 కేసుల‌తో మొద‌లై ఆ త‌ర్వాత వేగంగా విస్త‌రించింది. దీంతో బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు అప్ర‌మ‌త్త‌మై అన్ని ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నారు. ముంబై మురికి వాడ‌ను పూర్తిగా ప‌రిశుభ్రం చేశారు. అన్ని ఇండ్ల‌లో శానిటైజింగ్ నిర్వ‌హించారు. బాధితులను గుర్తించి క్వారెంటైన్‌కు త‌ర‌లించారు. అధికారులు ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కేసులు సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. గురువారం న‌మోదైన 33 కొత్త కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. కాగా, గురువారం ధార‌విలో కొత్త‌గా రెండు మ‌ర‌ణాలు కూడా సంభ‌వించాయి.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo