మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 14:19:11

అసోంలో వరదల బీభత్సం.. 33లక్షల మందిపై ప్రభావం

అసోంలో వరదల బీభత్సం.. 33లక్షల మందిపై ప్రభావం

గువాహటి: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మంగళవారం మరో తొమ్మిది మంది మృతిచెందారు. రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  59కు చేరింది.  మొత్తం 33 జిల్లాల్లో  27 జిల్లాల పరిధిలోని  సుమారు 33 లక్షల మందిపై ఈ వరదలు ప్రభావం చూపించాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక  చర్యల్లో  పాల్గొన్నాయి.     ప్రజలతో పాటు ప్రసిద్ధ కజీరంగా నేషనల్‌ పార్క్‌లోని  అడవి జంతువులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా వరకు జంతువులు గల్లంతయ్యాయి. 

బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో గ్రామాల్లోకి వరదనీరు వచ్చి చేరుతున్నది.  12 జిల్లాల్లో మరో ఎనిమిదికి పైగా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.   ఇప్పటి వరకు 28 జిల్లాల్లో 3,371 గ్రామాల్లో వరదనీరు ప్రవేశించడంతో 33 లక్షలమంది నిరాశ్రయులయ్యారు.  వరద బాధితుల కోసం  517 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  128,495  హెక్టార్ల పంటలు నీట మునిగాయి.  


logo