బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 25, 2020 , 15:54:25

32 మంది మావోయిస్టులు లొంగుబాటు

32 మంది మావోయిస్టులు లొంగుబాటు

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 32 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ 32 మందిలో న‌లుగురిపై రూ. ల‌క్ష చొప్పున‌ రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు. వీరంద‌రికి జీవ‌నోపాధి క‌ల్పిస్తామ‌ని పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి వ‌చ్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నార‌ని ఉన్న‌తాధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం లొంగిపోయిన మావోయిస్టుల‌కు త‌క్ష‌ణ సాయం కింద రూ. 10 వేలు ఆర్థిక సాయం అంద‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 150 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

32 మంది మావోయిస్టుల్లో 19 మంది బ‌కేలి గ్రామం, న‌లుగురు కొర్కోటి గ్రామం, ముగ్గురు చొప్పున‌ ఉదేన‌ర్, తుమ‌రాయిగుండా, మ‌తాసి గ్రామాల‌కు చెందిన వారు ఉన్నారు. వీరంతా దండ‌కార‌ణ్య ఆదివాసీ కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ట‌న్, క్రాంతిక‌రి మ‌హిళా ఆదివాసీ సంఘ‌ట‌న్, చేత‌న నాట్య‌మండ‌లి, జ‌న‌త‌న స‌ర్కార్‌కు చెందిన వారు. పోలీసుల టీమ్స్‌తో పాటు పోలింగ్ పార్టీల‌పై వీరు దాడులు చేశారు. ఐఈడీల‌ను కూడా ప‌లు సంద‌ర్భాల్లో పేల్చారు.