బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 12:12:26

మళ్లీ ప్ర‌మాదం.. 32 మంది వ‌ల‌స ‌కూలీల‌కు గాయాలు

మళ్లీ ప్ర‌మాదం.. 32 మంది వ‌ల‌స ‌కూలీల‌కు గాయాలు

కోల్‌క‌తా: లాక్‌డౌన్ కార‌ణంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే స్వ‌రాష్ట్రాల‌కు చేరుకుంటున్న వ‌ల‌స కూలీలు వ‌రుస‌గా ప్ర‌మాదాలకు గుర‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఇలాంటి ప్ర‌మాద‌మే చోటుచేసుకుంది. వ‌ల‌స కూలీలను త‌ర‌లిస్తున్న ఓ బ‌స్సు ఆదివారం ఉద‌యం ప్ర‌మాదానికి గురైంది. జ‌ల్పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి స‌మీపంలో బ‌స్సు అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో 32 మంది వ‌ల‌స కూలీలు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం జ‌ల్పాయ్‌గురి జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు.  


logo