మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 11:30:14

జైపూర్‌ ఎయిర్‌పోర్టులో 32 కిలోల బంగారం సీజ్‌

జైపూర్‌ ఎయిర్‌పోర్టులో 32 కిలోల బంగారం సీజ్‌

జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 31.9918 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా యూఏఈ, సౌదీఅరేబియా నుంచి వచ్చి రెండు ప్రత్యేక విమానాల్లో 14 మంది ఈ రోజు ఉదయం జైపూర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న మొత్తం 31.9918 కిలోల బంగారం లభించింది. దీని విలువ రూ.15.67 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 


కరోనాతో ప్రపంచ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రప్రభుత్వం మే 7న వందేభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు మూడు విడతలు పూర్తవగా, ప్రస్తుతం నాలుగో విడత వందేభారత్‌ మిషన్‌ కొనసాగుతున్నది. నాలుగో విడత జూలై 3న ప్రారంభమైంది. ఇప్పటివరకు 4.75 లక్షల మంది భారతీయులు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారు. 


logo