ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 12:09:01

వడోదర సరస్సులో 31తాబేళ్లు మృత్యువాత

వడోదర సరస్సులో 31తాబేళ్లు మృత్యువాత

వడోదర : గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని కమలానగర్‌ ప్రాంతంలోని సరస్సులో శనివారం 31 తాబేళ్లు మృత్యువాత పడ్దాయి. అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం  ఓ వ్యక్తి కమలానగర్‌ సరస్సు వద్ద మార్నింగ్‌ వాక్‌  చేస్తుండగా..  తాబేళ్ల కళేబరాలను గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని  మొత్తం 31 తాబేళ్లు మృత్యువాత పడినట్లు గుర్తించి వాటిని సరస్సు నుంచి బయటికి తీశారు. 

రేంజ్‌ ఫారస్ట్‌ ఆఫీసర్‌ నిధి దేవి మాట్లాడుతూ మేము 31 ఫ్లాప్‌ షెల్‌ తాబేళు కళేబరాలను స్వాధీనం చేసుకున్నాం. అవి ఎలా చనిపోయాయనేది తెలియరాలేదు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించాం. రిపోర్టు వచ్చిన తరువాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. logo