శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 16:18:10

ఇండోర్‌లో 31 మంది పోలీసులకు కరోనా

ఇండోర్‌లో 31 మంది పోలీసులకు కరోనా

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో ఇప్పటివరకు 31 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారని ఇండోర్‌ (ఈస్ట్‌) ఎస్పీ మహ్మద్‌ యూసఫ్‌ ఖురేషీ తెలిపారు. వారిలో 22 మంది వేర్వేరు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని, మరో ఎనిమిది మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఒకరు మృతిచెందారని ఖురేషి వెల్లడించారు. వివిధ ఆస్పత్రుల వద్ద కరోనా బాధితులతో కాంటాక్టులో ఉండే పోలీసులకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లను సమకూర్చామని ఎస్పీ ఖురేషి చెప్పారు.


logo