మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 13:23:52

జ్యువెల‌రీ షాపులో 31 మందికి క‌రోనా.. క‌స్ట‌మ‌ర్ల కోసం ట్రేసింగ్‌

జ్యువెల‌రీ షాపులో 31 మందికి క‌రోనా.. క‌స్ట‌మ‌ర్ల కోసం ట్రేసింగ్‌

హైద‌రాబాద్‌:  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో ఉన్న ఓ జ్యువెల‌రీ షాపులో 31 మందికి క‌రోనా వైర‌స్ సోకింది.  దీంతో ఆ న‌గ‌రంలో అప్ర‌మ‌త్త‌త ప్ర‌క‌టించారు. తాత్కాలికంగా ఆనంద్ జ్యువెల‌రీ షాపును మూసి .. డిస్ఇన్‌ఫెక్ష‌న్ చేస్తున్నారు.  అయితే ఈ స్టోర్‌ను గ‌త వారం రోజుల నుంచి విజిట్ చేసిన వారి గురించి అధికారులు ట్రేసింగ్ మొద‌లుపెట్టారు. వైర‌స్ సంక్ర‌మించిన ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల గురించి ట్రేసింగ్ ప్రారంభించామ‌ని, వారిలో ఎవ‌రికైనా ద‌గ్గు, జ‌లుబు లాంటి ల‌క్ష‌ణాలు ఉన్నాయో లేదో గ‌మ‌నిస్తున్నామ‌ని చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ప్ర‌వీణ్ జాదియా తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1.86 ల‌క్ష‌ల మంది కరోనా వైర‌స్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  ఆ రాష్ట్రంలో సుమారు 1200 మంది మ‌ర‌ణించారు.  నిన్న ఒక్క రోజే ఆ రాష్ట్రంలో కొత్త 194 మందికి వైర‌స్ సోకింది.